వేడి నీరు త్రాగడం వల్ల ప్రయోజనాలు: ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం వలన మన ఆరోగ్యాన్ని సగం మనమే కాపాడుకోవచ్చు
వేడి నీరు దాని యొక్క ముఖ్య ప్రయోజనాలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం అనేది చాలా అవసరం ఇంక చాలా కాలంగా వస్తున్న ఆచారం. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులభమైన మార్గం .వివిధ ప్రయోజనాలకోసం వివిధ మార్గాల్లో ఈ వేడి నీటిని వినియోగిస్తున్నారు.
జీర్ణ సమస్యలు దూరం అవుతాయి
మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది .ఇది జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ ను పెంచడం మరియు జీర్ణ అవయవాల ను ఉత్తేజపరచడం ద్వారా మెరుగైన జీర్ణ క్రియను కలిగి ఉంటాయి. వేడి నీరు తాగడం వలన కడుపు ఉబ్బరం,మరియు అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మనకు దగ్గు లాంటి సమస్యలు ఉంటే వేడి నీటిని తాగడం వలన ఈ సమస్య లు దూరం అవుతాయి. దీని వల్ల మన బాడీ లో అదనపు క్యాలరీలు కరుగుతాయి . కిడ్నీ లు కూడా చక్కగా పనిచేస్తాయి.
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లలో తేనే కలిపి తాగడం వల్ల చర్మ పోషణ చాలా ప్రయోజనాల్లో ఒకటి . మరియు చర్మం మీ మొత్తం ఆరోగ్యం,జివి జీవ క్రియ మరియు జీర్ణ క్రియను ప్రతిబింబిస్తుంది . కాబట్టి మీ చర్మానికి కాంతిని ఇస్తుంది . ఇది మొటిమలను కూడా తగ్గిస్తుంది. మరియు మచ్చల నయం ను మెరుగుపరుస్తుంది.
కండారాల నొప్పులు తగ్గుతాయి
వేడి నీరు త్రాగడం వల్ల ప్రయోజనాలు, గోరు వెచ్చని నీళ్లను తాగితే కండరాల ఉద్రికత్త తగ్గుతుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి . కండరాల నొప్పి, ఆర్ధరైటిస్ నొప్పి , నెలసరి తిమ్మిరి, నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లలో తేనే కలిపి తాగడం వల్ల చర్మ పోషణ చాలా ప్రయోజనాల్లో ఒకటి . మరియు చర్మం మీ మొత్తం ఆరోగ్యం, జీవ క్రియ మరియు జీర్ణ క్రియను ప్రతిబింబిస్తుంది . కాబట్టి మీ చర్మానికి కాంతిని ఇస్తుంది . ఇది మొటిమలను కూడా తగ్గిస్తుంది. మరియు మచ్చల నయం ను మెరుగుపరుస్తుంది.
ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది
తేనే గోరు వెచ్చని నీరు మీ నాడీ వ్యవస్థను ఉపశమనం చేస్తుంది . ఇది మీ కండరాల ను రిలాక్సేషన్ చేస్తుంది . మరియు ఒత్తిడి ని తగ్గిస్తుంది. గోరు వెచ్చని నీరు తాగితే స్ట్రెస్ నెమ్మదిగా తగ్గుతుంది. మీకు విశ్రాంతి ని కలిగిస్తుంది. మీ ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంపొందించడం లో సహాయపడే వేడి తేనే నీళ్ల ప్రయోజనాలలో రక్తానికి ఆక్సిజన్ సరఫరా మెరుగుపరచడం కూడా ఒకటి.
తక్షణ రీహైడ్రాషన్
రోజు రాత్రిపూట ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర తర్వాత, తక్షణ రీహైడ్రాషన్ కోసం నీరు త్రాగడం చాలా అవసరం. మీరు నిద్ర లేవగానే ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీరు (వేడి నీళ్లు /నార్మల్ /నిమ్మరసం ) తో అయినా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని త్వరగా రీహైడ్రెట్ చెయ్యొచ్చు.
అలెర్ట్ నెస్ ని పెంచండి
నీరు శరీర నియంత్రణలో మరియు మీ మానసిక స్థితిని సమతుల్యం చేయడం లో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయాన్నే నీటిని సిప్ చేయడం వల్ల మీ శక్తి స్థాయిల ను పెంచుతుంది. మరియు మీ చురుకుదనాన్ని పెంచుతుంది. తద్వారా మీరు మీ రోజును ఉత్సాహంగా ప్రారంభించవచ్చు.
మలబద్దకం దూరం అవుతుంది
వేడి నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి మలబద్దకంతో సహాయపడుతుంది. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజం పరచేందుకు మరియు ప్రేగు కదలికలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల మలాన్ని మృదువుగా చేయడం లో తద్వారా వాటిని సులభంగా వెళ్లేలా చేస్తుంది. దీని వల్ల త్వరగా మలబద్ధకం నిరోధించవచ్చు.
అధిక బరువు కంట్రోల్ అవుతుంది
గోరు వెచ్చని నీరు శరీరం యొక్క జీవ క్రియ ను పెంచానికి సహాయపడుతుంది. ఇది శరీరం లో క్యాలరీలను బర్న్ చేసి రేటును పెంచేలా చేస్తుంది. ఇది మొత్తం ఆహరం తీసుకోవడం తగ్గించి బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఇది బరువు తగ్గడానికి సాధారణ అడ్డంకులు అయిన ఉబ్బరం, మరియు మల బద్దకాన్ని నివారించడం లో ఉపయోగపడుతుంది.