Idli Dosa Batter Good or Not – ఇడ్లి, దోశలకి రెడీమేడ్ పిండిని వాడుతున్నారా ? అయితే కష్టమే ! ఈ రోజుల్లో చాలామంది బ్రేక్ఫాస్ట్ కి సంబంధించిన ఇడ్లి , దోశ పిండిని కూడా ఇంట్లో తయారు చేసుకోవడం కన్నా , బయట టక్కున కొనుక్కుని తినడం అలవాటు చేసుకున్నారు. పిండిని రుబ్బుకుని ఓపిక లేకనో , లేదో వర్క్ హడావిడో , టైమ్ లేకనో గాని ఆ రెడీమేడ్ పిండికి బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడున్న కాలంలో అన్నీ మార్కెట్ లో దొరికేస్తున్నాయి. అలా అని అసలు చేతికి పని చెప్పకుండా జనాలు ఇలా కొనుక్కుని తినడం వల్ల ఆరోగ్యానికి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇలా రెడీమేడ్ పిండిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో ఇప్పుడు బోరిక్ యాసిడ్ అనే ఫ్లేవర్ ని యాడ్ చేస్తున్నారు. అసలు ఇలా తినడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఈ బోరిక్ యాసిడ్ వల్ల నష్టాలు తెలుసుకుందాము.
Readymade Idli Dosa Batter Disadvantages:
వేస్ట్ వాటర్ వాడటం
ఇలా ప్యాకెట్ పిండిని తెచ్చుకుని అలా ఫ్రిజ్ లో పెట్టుకుని తినేస్తాం. కానీ ఇలా నిల్వ ఉండటానికి ఎన్ని ఫ్లేవర్స్ ఆడ్ చేస్తారో కూడా మనకి తెలియదు. కానీ ఈ టేస్ట్ బావుంది అని తినేస్తాం. ఇంకోటి ఇలా నిల్వ ఉంచడం వల్ల నీరు ఊరుతుంది అదే వేస్ట్ వాటర్. అసలు ఈ ప్యాకెట్ పిండిలో ఎలాంటి వాటర్ కలుపుతారో , ఎలాంటి గ్రైండర్ వాడతారో కూడా మనము తెలుసుకోకుండా వాడేస్తాం. సమస్యలకి లోనవుతాం.
దీని వల్ల జీర్ణ సమస్యలు
ఇలాంటి కలుషితమైన నీటితో తయారు చేసిన పిండిని తినడం వల్ల తీవ్రమైన అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుంది. అంతేకాకుండా ee వేస్ట్ వాటర్ ద్వారా ఏకోలి బాక్టీరియా బాగా పెరిగి , కడుపు నొప్పి , శరీరం పొడిబారడం , విరేచనాలు, ప్రేగు , గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఈ బోరిక్ యాసిడ్ ఏంటి
ఈ బోరిక్ యాసిడ్ అనేది ఈ ప్యాకెట్ పిండిని నిల్వ చేయడానికి ఇంక ఇది పుల్లగా మారకుండా ఉండడానికి ఈ బోరిక్ యాసిడ్ వేసి ముందు ఆ తర్వాత పిండిని వేసి గ్రైండ్ చేస్తారు. దీని వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చూస్తారు. ఒకవేళ పిండి పులిసినా కూడా మనకి తెలియదు.
బోరిక్ యాసిడ్ వల్ల నష్టాలు
ఇలాంటి బోరిక్ యాసిడ్ కలిపిన పిండిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఇది తినడం వల్ల
పేగులు ఎఫెక్ట్ అవుతాయి. దీని వల్ల కడుపు నొప్పి పెరిగి దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడతాయి.
పిండిని నిల్వ ఉంచడం మంచిది కాదు
ఇలా పిండిని నిల్వ ఉంచితే పులుస్తుంది. కానీ దింట్లో కొన్ని ఫ్లేవర్స్ ఆడ్ చేయడం వల్ల ఈ పులియడం మనకు తెలియట్లేదు. కానీ ఇలా తింటే మాత్రం కాలేయానికి మంచిది కాదు. చాల ప్రమాదకరం కూడా. ఇలా నిల్వ ఉన్నప్పుడు పిండి విపరీతంగా పొంగుతుంది. దీని వలన రుచిని కోల్పోతుంది. ఇలా పులియబెట్టడం కోసం కిణ్వ ప్రక్రియ కోసం అధిక గ్యాస్ ని ఉత్పత్తి చేస్తారు. దీని వల్ల సమస్యలు ఏర్పడతాయి.
ఇడ్లి , దోశ అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
ఈ ఇడ్లి , దోశ లను అధికంగా వినియోగించడం వల్ల కొంతమంది లో ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. దీని వల్ల గుండెల్లో మంట , బర్ప్స్ , ఉబ్బరం మరియు తిమ్మిరిని ప్రేరేపిస్తాయి. ఇలాంటి పులియబెట్టిన వంటకాన్ని అధికంగా తీసుకోవడం ద్వారా మధుమేహం ఉన్నవారికి అనారోగ్యకరమైన ఆహార ఎంపిక.
మరింత ఆరోగ్యము మరియు ఆరోగ్య చిట్కాలు కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.