Abdominal Sounds:ప్రేగుల్లో నుండి శబ్దాలు వస్తున్నాయా ? ఎందుకిలా ?
కొన్నిసార్లు మనకు ప్రేగుల్లో శబ్దాలు వినిపిస్తుంటాయి. దీనితో ఆందోళనకు గురవుతూ ఉంతాము. అయితే ఇలా ఎందుకు జరుగుతున్నది అని చాల మందికి అంతు చిక్కని ప్రశ్న. కడుపు లోని శబ్దాలు ప్రేగులు కదలిక ల ద్వారా ఆహారాన్ని నెట్టడం ద్వారా ఏర్పడతాయి. దీని తో మనం మనకి ఏమిజరిగింది అని కంగారు పడుతూ ఉంటాము. అందుకే ఈ శబ్దాల కి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము.
ఉదర శబ్దాలు
ప్రేగు శబ్దాలు చాలా సాధారణమైనవి. ఇలా శబ్దాలు వస్తన్నాయంటే జీర్ణశయాంతర ప్రేగు పని చేస్తుంది అని అర్ధం. ప్రేగులు బోలుగా ఉంటాయి. కాబట్టి నీటి పైపుల నుండి వినిపించే శబ్దాల వలె ప్రేగు శబ్దాలు ఉదరం ద్వారా ప్రతిధ్వనిస్తాయి. ప్రేగు శబ్దాలు ఎలాంటి హాని చేయనివే.
గ్యాస్ లేదా విరేచనాల సమస్య ఉన్నవారికి
గ్యాస్ ఫార్మ్ అయినప్పుడు కూడా ఇలాంటి సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేగులు నుండి శబ్దాలు మరీ ఎక్కువగా వస్తే ఇలాంటి సమస్యలతో బాధపడే వారని తెలుసుకోండి. ప్రేగులు , ఆహరం కదలిక ల వల్ల కొన్ని సార్లు గ్యాస్ ఏర్పడి అది శబ్దాలుగా మారుతుంది. విరేచనాల సమస్యతో బాధపడేవారికి ఇలాంటి శబ్దాలు ఎక్కువగా వస్తాయి.
వికారం , వాంతులు సమస్య ఉన్నవారికి
Also Read: నిద్ర కు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా ?
మనం ఏది అయినా అనారోగ్యం తో భాద పడుతుంటే ఆ సమయం లో ఏమి తినక కడుపు ఖాళీ గ ఉండటం వల్ల ఇలాంటి శబ్దాలు వినిపిస్తుంటాయి. వికారం , వాంతులు అయ్యే వారికి ఇంక అవ్వబోతున్న వారికి ఇలా ప్రేగులు శబ్దాలు వస్తుంటాయి.
ప్రేగుల శబ్దాలు అసలు రాకపోతే
ఒకవేళ అసలు ప్రేగుల శబ్దాలు రాకపోతే అటువంటి వారు మల బద్ధకం తో భాదపడుతున్నారని అర్ధం. అలాంటి వారికి ప్రేగుల శబ్దాలు రావు. ప్రేగుల శబ్దాలు తగ్గడం లేదా లేకపోవడం తరచుగా మల బద్దకాన్ని సూచిస్తాయి. లేదా జీర్ణ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి. ప్రేగుల శబ్దాలు రాకపోయినా ,లేదా మరీ ఎక్కువగా వస్తున్నా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
People also ask:
- ప్రేగు శబ్దాలు ఎక్కడ వినాలి?
- ప్రేగు శబ్దాలు లేకపోతే అర్థం?
- ప్రేగు శబ్దాలు వినడానికి ఎంత సమయం పడుతుంది?
- ఏ ప్రేగు శబ్దాలు పెరిటోనిటిస్తో సంబంధం కలిగి ఉంటాయి?
- ప్రేగు శబ్దాలు బాగున్నాయా?
- కడుపు శబ్దం గురించి నేను ఎప్పుడు ఆందోళన చెందాలి?