Post Office Schemes For Children: బాల్ జీవన్ బీమా యోజన (Bal Jeevan Bima Yojana)
పిల్లల కోసం పొదుపు చేయడానికి ఈ రోజుల్లో చాల స్కీం లు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ నుండి కూడా ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో నే కొన్ని రకాల ఇన్సూరెన్స్ సేవింగ్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అదే బాల్ జీవన్ భీమా పథకం. పోస్టాఫీసు అందిస్తున్న రురల్ ఇన్సూరెన్స్ స్కీం లలో ఇదొకటి. అయితే ఇది కేవలం చిన్నారుల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కేవలం రోజుకి గరిష్టంగా రూ. 18 / చెల్లిస్తే మెచూరిటీ తర్వాత 3 లక్షలు చేతికి రావడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
బాల్ జీవం భీమా యోజన పథకం వివరాలు
పిల్లలకు సంబంధించి ఈ పథకం బాగా యూస్ అవుతుంది. రోజుకి రూ. 6 చొప్పున ఆదాతో మెచూరిటీ కల్ల లక్ష రాబడి వస్తుంది అని చెప్పవచ్చు. అదే రూ. 18 / చొప్పున ఆదా చేసుకుంటే 3 లక్షలు పొందవచ్చు. ఈ పథకం లో చేరాలంటే 5 నుండి 20 సంవత్సరాల
లోపు వరకు వయస్సు ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ తల్లిద్రండులకు 45 ఇయర్స్ మించకూడదు.
కుటుంబలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే
ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం అందుతుంది. మీకు ఇద్దరు పిల్లలు ఉంటె గనుక రోజుకి రూ. 36 చొప్పున ఆదా చేస్తే మెచూరిటీ సమయానికి రూ. 6 లక్షలు వస్తాయి.
పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు
1. పాలసి తీసుకునే సమయానికి పాలసి దారు ( తల్లి / తండ్రి ) వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు.
2. పాలసి దారు మెచూరిటీ ముందే మరణిస్తే , ఆ టైం లో ఇకపై పాలసి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసి గడువు ముగిసాక పిల్లలకు పూర్తీ మెచూరిటీ కి మొత్తం చెల్లిస్తారు.
3. పాలసి ప్రీమియం ని పేరెంట్స్ చెల్లించాలి.ఈ పాలసి మీద రుణ ప్రయోజనం ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
4. ఒకవేళ పాలసి నుండి మద్యలో వైదొలగాలంటే 5 సంవత్సరం తర్వాత సరెండర్ చేసే అవకాశం ఉంది.
5. రు 1000 ప్రతి సం” హామీ మొత్తం మీద రూ. 48 బోనస్ ఇస్తారు.
ఈ స్కీం లో చేరాలంటే దగ్గర లోని పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి వివరాలు కనుక్కొని డాకుమెంట్స్ సబ్మిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్కోవచ్చు.