Body Pains: తరచూ ఒళ్ళు నొప్పులా ? కారణాలు ఇవే? ఇలా చెక్ పెట్టండి…
శరీర నొప్పి చాలా సాధారణం మరియు ఏ వయస్సులో మరియు సమయంలో ప్రభావితం చేయవచ్చు. కొన్ని ఆరోగ్య పరిస్థితుల ద్వారా ఈ నొప్పులు రావడం జరుగుతుంది. జీవన శైలి కారకాలు సాధారణ శరీర నొప్పులకు కారణమౌతున్నాయి. అవేంటో చూద్దాం.
మితి మీరిన శ్రమ
కండరం మీద ఒత్తిడి ఎక్కువ అవటం , మరియు శక్తికి మించిన శ్రమ , పని ఒత్తిడి ఉద్వేగాలు కూడా కండ నొప్పులకు ఒక కారణం. వీటి వల్ల శరీర నొప్పులు రావడం జరుగుతుంది.
మానసిక ఒత్తిడి
ఒత్తిడి మనల్ని శారీరకం గానే కాదు. మానసికం కూడా ఒత్తిడికి ప్రభావం చేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీనితో శరీరం ఎన్నో రోగాలకు ఆవాసం గ మారి శరీర నొప్పులకు దారి తీస్తుంది.
విటమిన్ డి
విటమిన్ డి శరీర నొప్పులకు ఒక కారణం. ఇది ఎముకలను , దంతాలను బలంగా ఉంచడం లో సహాయపడుతుంది. ఇది లోపించడం వల్ల నొప్పులు ఏర్పడతాయి.
ఇన్ఫెక్షన్
కండరాల నొప్పికి కారణం అయ్యే అత్యంత సాధారణంగా అనుభవించిన ఇన్ఫెక్షన్ లలో ఒకటి ఈ ఫ్లూ . ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ల వల్ల కూడా ఒళ్ళు నొప్పులు ఉంటాయి.
ఐరన్ లోపం
ఐరన్ లోపం వల్ల కూడా శరీర నొప్పులు వస్తాయి. బ్లడ్ లో ఐరన్ అనేది చాలా ముఖ్యమైన మూలకం. ఇది తక్కువగా ఉండటం వల్ల శరీరం లోని వివిధ భాగాలకు పోషకాలు సరిగా అందకపోవడం వల్ల కూడా ఈ నొప్పులు వస్తాయి.
నిద్రలేమి
నిద్ర అనేది శరీరం విశ్రాంతి తీసుకోవడం మరియు కోలుకోవడానికి సమయం. ఇది శరీరానికి చాల అవసరం. దాదాపు 6 నుండి 8 గంటల వరకు నిద్ర పోవాలి. దీని వల్ల శరీరం దాని శక్తి వనరులను పునరుత్పప్తి చేసి మనల్ని రిఫ్రెష్ చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది.
డీహైడ్రేషన్
మానవ శరీరం దాదాపు 70 శాతం నీటితోనే నిర్మితమై ఉంటుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల కండరాల తిమ్మిరి మరియు నొప్పికి కారణం. మనం నీరు తాగినప్పుడు మన శరీరం లో నీటి నిల్వలు తగ్గి, దీని వల్ల అలసట , నొప్పులకు దారి తీస్తుంది.
పోషకాహార లోపం
ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహరం తీసుకోక పోవడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు లభించక వీటి వల్ల నొప్పులు ఏర్పడతాయి. మరియు సమయానికి తినకపోవడం వల్ల శరీరం బలహీనంగా మారి అలసిపోయి నొప్పిగా అనిపించవచ్చు.
మందులు
సగం నొప్పులు మనం వేసుకునే మందుల వల్లే వస్తాయి. స్టాటిన్స్ లేదా కొన్ని రక్త పోటు తగ్గించే మందులు వంటి కొన్ని రకాల మందుల వల్ల ఇలాంటి నొప్పులు వస్తాయి.
న్యూమోనియా
న్యూమోనియా అని పిలవబడే ఊపిరితిత్తుల లో ఇన్ఫెక్షన్లు , వైరల్ లేదా బ్యాక్టీరియా కావచ్చు. ఈ న్యూమోనియా ప్రారంభ దశలో శరీర నొప్పులు ఏర్పడతాయి.
రక్త హీనత
రక్త హీనత అనేది మరొక పోషకాహార లోపం. రక్త హీనత అనేది రక్తం లో వర్ణ ద్రవ్యం , హిమోగ్లోబిన్ లోపం వల్ల కలిగే ఆరోగ్య పరిస్థితి. దీని బలహీనత, అలసట వల్ల శరీర నొప్పులు కలుగుతాయి.
డిప్రెషన్
దుఃఖం మరియు ఆందోళన తో సహా ప్రతికూల భావోద్వేగాలు దీర్ఘకాలిక నొప్పిని తీవ్రతరం చేస్తాయి. డిప్రెషన్ అనేది విచారం లేదా ఆసక్తిని కోల్పోవడం యొక్క అధిక అనుభూతి. డిప్రెషన్ మానసికంగా శరీరాన్ని హరించి వేసి , శరీర నొప్పులకు ముందడుగు వేస్తుంది.
వ్యాధులు మరియు వంశపారంపర్య పరిస్థితులు
హైబ్రోమైయుల్జియా , హైపోథైరాయిడిజం , మల్టిఫుల్ స్క్ల్ రోసిస్ , రుమటాయిడ్, ఆర్థరైటిస్ మరియు ఇతర పరిస్థితులు కండరాల బలహీనతకు కారణమవుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి….