Chicken side effects: అయినా ఈ రోజుల్లో చికెన్ లేకుండా తినేవాళ్లు ఉన్నారా ! చెప్పండి. చికెన్ తో ఏ టైప్ కర్రీ చేసినా కూడా మంచిగా లాగించేవాళ్లు చాల మంది ఉన్నారు. చికెన్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. చికెన్ లో బ్రెస్ట్ పుష్కలం గ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదల , రిపేర్ చేయడానికి, బలం పెరగడానికి సహాయపడుతుంది. అలా అని చికెన్ ని రెగ్యులర్ గ తినడం మంచిది కాదు. దీని వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే చికెన్ తినేవాళ్లు చికెన్ యొక్క మంచి , చెడూ తెలుసుకుని తినాలని నిపుణులు చెబుతున్నారు.
చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు
బరువు పెరుగుతాం
మనం రోజు చికెన్ తినడం వల్ల ఖఛ్చితంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చికెన్ లో కాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల అది మన బరువు పెరగడానికి కారణం అవుతుంది.
శరీరం లో వేడిని పెంచుతుంది
చికెన్ వేడి అని అందరికి తెలుసు. కానీ దాని మీద ఉన్న ఇష్టం తో తినేస్తూ ఉంటారు. ఇది మన శరీర ఉష్ణోగ్రత ను పెంచడానికి పనిచేస్తుంది. దీని వల్ల కాన్సర్ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే చికెన్ ను తక్కువ మోతాదులో తీసుకోమని నిపుణులు చెబుతున్నారు.
మహిళల్లో థైరాయిడ్ పెరుగుతుంది
ప్రతిరోజూ చికెన్ తింటే శరీరం లో హార్మోనర్ ఇన్ బ్యాలన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మహిళల్లో ముఖ్యంగా థైరాయిడ్ విపరీతంగా పెరిగే అవకాశం అవకాశం ఉంది అంతేకాకుండా దీని వల్ల శరీర పెరిగి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
లివర్ ఎఫెక్ట్
చికెన్ వారానికి ఒకసారి మాత్రమే తినాలి. రోజు తినడం వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
యూరినరీ ఇన్ఫెక్షన్స్
రెగ్యులర్ గ చికెన్ తినడం వలన మూత్రనాళ ( UTI) ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే UTI ఇన్ఫెక్షన్స్ తో పాటు ఇతర ఇన్ఫెక్షన్స్ వస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి.
గుండె సంబంధిత వ్యాధులు
చికెన్ ఎక్కువగా తింటే రక్తం లో కొలస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె సమస్యలు , హైపర్ టెన్షన్ , స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది.
గమనిక: నిపుణులు మరియు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించండి. గమనించగలరు.