Whatsapp Call Record – వాట్స్ అప్ కాల్స్ రికార్డ్ చేయడం ఎలా ?
ప్రస్తుతం ఉన్న డిజిటల్ కాలంలో వాట్స్ అప్ గురించి తెలియని వారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చిన్న నుండి పెద్ద వరకు అందరూ వాట్స్ అప్ లోని అన్ని ఫీచర్ల గురించి అప్డేట్ లోనే ఉంటున్నారు. కానీ వాట్స్ అప్ లో కాల్ రికార్డింగ్ ఎలా చేయాలో నూటికి తొంభై శాతం మందికి తెలియదు.దీనికి సంబంధించిన కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే చాలు. దీని వల్ల ఆడియో , వీడియో కాల్స్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదెలాగో చూద్దాం.
రికార్డ్ ఎలా చేయాలో చూద్దాం
వాట్స్ అప్ కాల్స్ రికార్డ్ చేయాలంటే కాల్స్ మాట్లాడేముందు కొన్ని అప్షన్స్ ఎనబుల్ చేసుకోవాలి. దీనికి ముందు స్క్రీన్ రికార్డర్, వీటికన్నా ముందు వీడియో , మైక్ అప్షన్స్ ఎనబుల్ చేయడం ద్వారా వీడియో కాల్స్ రికార్డ్ అవుతాయి, కానీ ఇలా చేయడం ద్వారా అంత క్లియర్ గ ఉండకపోవచ్చు కానీ ఇది మన ప్రాధమిక అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది.
ఇలాంటి థర్డ్ పార్టీ ద్వారా కూడా రికార్డ్ చెయ్యొచ్చు
ఆల్రెడీ మనం అనుకున్నట్టు కాల్ రికార్డింగ్ సంబందించి ప్లే స్టోర్ లో చాలా యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే “కాల్ రికార్డర్ క్యూబ్ ACR ” యాప్ ని డౌన్లోడ్ చేసి , ఈ వాట్స్ అప్ ఇన్ కమింగ్ , అవుట్ గోయింగ్ కాల్స్ ని రికార్డ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అంతేకాదు ఈ ప్లే స్టోర్ యాప్ లో టెలిగ్రామ్ , స్లాక్ , జూమ్ , ఫేస్బుక్, సిగ్నల్ వంటి ఇతర యాప్స్ యొక్క కాల్స్ ని కూడా రికార్డ్ చెయ్యొచ్చు.
ఇన్ బిల్ట్ రికార్డింగ్ ఫీచర్
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ లు అన్ని ఈ ఇన్ బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ తోనే వస్తున్నాయి. ఇలాంటి ఫోన్ లు వాడేవారు థర్డ్ పార్టీ యాప్స్ ని ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా ఇన్ బిల్ట్ ఫీచర్ ని ఎనబుల్ చేస్తే సరిపోతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లోని డిఫాల్ట్ ఫోన్ యాప్ లో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ యాప్ సెట్టింగ్స్ కి వెళ్లి కాల్ రికార్డింగ్ ఆప్షన్ ను ఎనబుల్ చేస్తే అన్ని కాల్స్ రికార్డ్ అయ్యేలా ఆటో రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేస్తే సరిపోతుంది.