Linkedin New AI Tools – ఉద్యోగార్థులకు తోడుగా లింక్డ్ ఇన్ లో కొత్త టూల్స్
డిగ్రీ లు ,పీజీ లు పూర్తి చేసిన ఉద్యోగార్ధులకు ఎక్కువగా ఆధారపడే ప్లాట్ ఫార్మ్ లింక్డ్ఇన్ . జాబ్ సెర్చింగ్ లో యూజర్లకు ఉపయోగపడేలా లింక్డ్ ఇన్ కొత్త AI( ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) ని ఫీచర్ల ను అందుబాటులో కి తెచ్చింది. లింక్డ్ ఇన్ లో కావాల్సిన జాబ్ పోస్టింగ్స్ ను వెతకడం కోసం ఇప్పటి వరకు వివిధ రకాల ఫిల్టర్స్ ఉపయోగించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా AIటూల్స్ ఆ పని ని సులభతరం చేయనున్నాయి. ఈ కొత్త ఫీచర్లను ప్రీమియం సబ్స్క్రైబర్లు మాత్రమే పొందడం గమనార్హం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జాబ్ సీకర్ కోచ్
యాప్ లోని ఫీచర్లకు AIసాయం అందించనుంది. ఫలితంగా జాబ్ సీకర్స్ కు కచ్చితమైన సమాచారాన్ని అందించగలుగుతుంది. కావాల్సిన ఉద్యోగం ..కావాల్సిన చోట మనకి కావాల్సిన ఉద్యోగం ఎలా ఉండాలో అది ఇంగ్లీష్ లో టైప్ చేసి అడిగితే , డేటాబేస్ లో దానికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని యూజర్ ముందు ఉంచుతుంది. మనం అప్లై చేసుకున్నప్పుడు మన ప్రొఫైల్ ముందు ఉండేలా మార్పులు కూడా ఎలా చేయాలి అని తెలియజేస్తుంది.
కవర్ లెటర్ అసిస్టెన్స్
మన ప్రొఫైల్ కి సంబందించి అనుకూలీకరించిన కవర్ లెటర్ సిఫార్సులను ఎలా ఎడిట్ చేయాలో కూడా చూడవచ్చు. ఈ ఇంటరాక్టివ్ చాట్ బాట్ తో చాట్ చేస్తూ మనం ఎలాంటి ఉద్యోగం కోరుకుంటున్నామో సమాచారం తెలియజేస్తే సరిపోతుంది. వాటికి తగ్గట్టు ఓ డ్రాఫ్ట్ కవర్ లెటర్ సిద్ధం చేస్తుంది.
రెజ్యుమ్ అండ్ అప్లికేషన్ రివ్యూ టూల్
ఈ టూల్ కి సంబందించి రెజ్యుమ్ , అప్లికేషన్ లను అప్లోడ్ చేస్తే AI వాటిని క్లియర్ గ పరిశీలించి ఎక్కడెక్కడ ఏమేం మెరుగుపర్చాలో తెలియజేసి మన ప్రొఫైల్ జాబ్ కి సెలెక్ట్ అయ్యేలా మన రెజ్యుమ్ , అప్లికేషన్ లో ఏఏ స్కిల్స్ ని హైలైట్ చేయాలో కూడా తెలియజేస్తుంది.
మరిన్ని AI ఫీచర్లు
ఈ లింక్డ్ ఇన్ కోర్సులలో అభ్యాసకులు , ప్రీమియం ఖాతాదారులు AI నుండి సారాంశాలు , వివరణలు , ఉదాహరణలు …ఇతరములు లాంటివి అడగవచ్చు. ఈ లింక్డ్ ఇన్ శోధన కోసం కంపెనీ కొత్త AI _ ఆధారిత మెరుగుదలను కూడా హైలైట్ చేస్తుంది. వివిధ రంగాలకు చెందిన నిపుణులు అందించే సలహాలను ముందుగానే AI లో నిక్షిప్తం చేస్తారు. వీటిని ఎప్పటికప్పుడు కొత్త వాటిలో అప్డేట్ చేస్తారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్లు ప్రీమియం సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని గమనించాలి. వీటితో పాటు రిక్రూటింగ్ సంస్థలకు కూడా ఉపయోగపడేలా కొత్త సాధనాలను తీసుకొస్తున్నట్లు లింక్డ్ ఇన్ ప్రకటించింది.