కార్డ్ పోయిందా ? క్షణంలో కొత్త కార్డు

కార్డ్ పోయిందా ? క్షణంలో కొత్త కార్డు
Lost the card? Get A new card in an instant కార్డ్ పోయిందా ? ఉచితంగా ఇలా కొత్తది పొందండి

చాలా మంది ఎలాంటి కార్డ్ అయినా వాలెట్ , పర్స్ లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏ రకమైన కార్డు అయిన పోగొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధపడాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా తిరిగి పొందే అవకాశం ఉంది.

ఆధార్ కార్డ్ కార్డ్ పోయిందా? – AADHAR CARD

సాధారణముగా మన ఆధార్ కార్డ్ పోయినప్పుడు దాని కోసం మనం యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ కు వెళ్లి దాన్ని సంపాదించడం కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటాము. ఆలా కాకుండా మనం మొదట చేయాల్సిన పని ఏంటి అంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి 18001801947 కు కాల్ చేసి కంప్లయింట్ చెయ్యాలి. చాలా సులువుగా ఎలాంటి ఫీ లేకుండా నేరుగా ఇంటికే పోస్ట్ ద్వారా ఆధార్ కార్డ్ పంపించడం జరుగుతుంది . దీనికి సంబంధించిన పూర్తి సమాచారము కోసం హెల్ప్ @ uidai.gov.in ఈ వెబ్సైటు లో చెక్ చేస్కోవచ్చు.

రేషన్ కార్డ్ – RATION CARD

మనం వాడే ముఖ్యమైన కార్డ్ లలో రేషన్ కార్డు ఒకటి . రేషన్ కార్డ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో మనందరికీ తెలుసు. ఈ కార్డ్ లేకపోతే మనకి ఎటువంటి ధ్రువ పత్రాలు పొందలేము. రేషన్ కార్డ్ కొన్ని రకాల పత్రాలకి ….అనుసంధానం గ మారింది. పోయిన కార్డు ని తిరిగి మళ్ళి అదే నెంబర్ తో మన సచివాలయం లో పొందవచ్చు. ఇంకో విధంగా స్థానిక తాసిల్దార్ గారి కార్యాలయం లో సంప్రదించడం ద్వారా అదే నెంబర్ తో తాత్కాలిక కార్డ్ ని పొందే అవకాశం ఉంది. దీని సమాచారము కోసం aepos.ap.gov.in వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకుని xerox కాపీ పొందే ఛాన్స్ ఉంది.

ALSO READ: వేడి నీరు త్రాగడం వల్ల ప్రయోజనాలు

ఓటర్ గుర్తింపు కార్డ్ – VOTER CARD

కార్డ్ పోయిందా ? క్షణంలో కొత్త కార్డు

ఓటర్ గుర్తింపు కార్డ్ అనేది కేవలం ఓటు కి మాత్రమే వినియోగిస్తారు అనుకుంటారు చాలామంది కానీ విషయం ఏంటంటే మన నివాస ,పుట్టుక పత్రాలను పొందాలంటే ఖచ్చితంగా ఓటర్ గుర్తింపు కార్డ్ తప్పనిసరి. అందుకే పోగొట్టుకున్నాం కదా అని అలా వదిలేయకుండా దీని అవసరతను తెలుసుకుని పోయిన కార్డ్ కోసం స్థానిక తాసిల్దార్ కార్యాలయం లో అప్లై చేసుకుంటే ఫ్రీ గ ఈ కార్డ్ ని మనకి జారీ చేస్తారు.

పాన్ కార్డ్ – PAN CARD

ఒక పాన్ కార్డ్ వల్ల ఉన్న అవసరాలు ఏంటో మనకి బాగా తెలుసు. ఈరోజుల్లో పాన్ కార్డు కి ఉన్న అవసరత చాలా ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్ , IT ఇతర ఆర్ధిక లావాదేవీల కి సంబంధించిన పనులు ఇంక అన్ని రకాలైన పనులు అవ్వాలంటే పాన్ కార్డ్ అనేది ఉండాలి. ఇది ఏదైనా ఆర్థికలావాదేవీల కు ఇవ్వాల్సిన తప్పనిసరి పత్రం. అందుకే పాన్ కార్డ్ పోయిందని టెన్షన్ పడకుండా చాలా సులువుగా ఇంట్లో నుండి ఆన్లైన్ ద్వారా తిరిగి కొత్త కార్డు ని పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకుని పూర్తి వివరాల కోసం www.nsdipan.com వెబ్సైట్ ని సంప్రదించండి .

ఎటిఎం కార్డ్ – ATM CARD

ఎటిఎం కార్డ్ పోగొట్టుకున్న అనంతరం మనం చెయ్యాల్సిన మొదటి పని ముందు సంబంధిత బ్యాంకు కి వెళ్లి ఫిర్యాదు చేసి కార్డ్ ని బ్లాక్ చేయించుకోవాలి. తర్వాత కొత్త కార్డు కోసం బ్యాంకు మేనేజర్ కి అడిగిన పూర్తి సమాచారము అందించాక అది కంఫర్మ్ చేసుకుని కొత్త ఎటిఎం కార్డ్ ని జారీ చేస్తారు.

పాస్ పోర్ట్ – PASSPORT

పాస్ పోర్ట్ కార్డ్ పోయిందా? మన జీవితం లో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు ఇది లేకపోవడం వల్ల ఎంతోమంది వాళ్ళ కలల్ని నిజాలు చేసుకోలేకపోతున్నారు. ఇంత ముఖ్యమైన పాస్ పోర్ట్ ని మనం పోగొట్టుకొన్నప్పుడు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫ్ ఐ ర్ ఫైల్ చేయించుకోవాలి.పోలీస్ శాఖ వారు విచారణ జరిపిన తర్వాత అప్పటికి మన పాస్ పోర్ట్ దొరకకపోతే వాళ్ళు మనకి “Non టాస్డ్ ” ధ్రువ పత్రం ఇస్తారు.వీటిని తీస్కుని మీరు ఇవిస్ పాస్ పోర్ట్ దరఖాస్తు కేంద్రం లో పాస్ పోర్ట్ యొక్క ” మళ్ళి _ఇష్యూ ” కోసం దరఖాస్తు చేస్కోవచ్చు మరియు మీ పాస్ పోర్ట్ ధరఖాస్తు ఫారం తో పాటు ఫ్ ఐ ర్ సహా అన్ని అవసరమైన పత్రాలను అందించాలి. అనంతరం పాస్ పోర్ట్ అధికారి పేరిట 1000 కి DD తియ్యాలి. ఇవి కూడా జత పర్చి అప్లై చేసుకోవాలి. తర్వాత ఐ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి డూప్లికేట్ పాస్ పోర్ట్ జారీ చేస్తారు. ఇది రావడానికి త్రీ మంథ్స్ పడుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ – DRIVING LICENCE

ఒక బండి ని మనం బయటికి తియ్యాలంటే దానికి సంబంధించిన అన్ని పత్రాలు మన దగ్గర ఉండాలి లేకపోతే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు ఒకవేళ అలాంటి..వాటినే మనం పోగొట్టుకుంటే డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందే సులభమైన మార్గాలు చాలా ఉన్నాయి. మన డ్రైవింగ్ లైసెన్స్ పొతే ముందు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఫ్ ఐ ర్ కాపీ పొందడం ముఖ్యం. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చెయ్యడానికి ముందు ఫ్ ఐ ర్ కాపీ తో పాటు అన్ని రకాల డాకుమెంట్స్ ని ఆన్లైన్ లో అధికారిక వెబ్సైటు లో అప్లై చెయ్యాలి. అక్కడ వెబ్సైట్ లో LLD ఫార్మ్ ఫిల్ చేసి , దానికి తగిన రుసుము చెల్లించి ఈ ప్రాసెస్ పూర్తి కాగానే ఆ ఫార్మ్ ప్రింటౌట్ తీసుకుని RTO ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే మీ డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికే వస్తుంది.

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *