LPG Gas Booking through Whatsapp: వాట్స్ అప్ ద్వారా గ్యాస్ బుకింగ్.. ఎలాగో చూద్దాం !
ఈ మధ్య కాలంలో చమురు కంపెనీలు ఒక కొత్త పద్దతిని తీసుకువచ్చాయి. అదేంటంటే ఇకపై గ్యాస్ సిలిండర్లు వాట్స్ అప్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. ఇలా ప్రవేశ పెట్టిన కొత్త పద్దతి ద్వారా నేరుగా సదరు కంపెనీ వాట్స్ అప్ నెంబర్ కు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో ఒక మెసేజ్ పెట్టి చాల ఈజీ గ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఇందు మేరకు రీఫిల్ బుకింగ్ సులభతరం చేసేందుకు ఈ పద్దతిని ప్రవేశపెట్టినట్లు ఈ చమురు సంస్థలు తెలిపాయి. అసలు వాట్స్ అప్ ద్వారా గ్యాస్ ఎలా బుక్ చేయాలో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
LPG Gas Booking Whatsapp Numbers: ముందు ఈ నెంబర్ లు గుర్తుంచుకోవాలి
ముందుగా మన ఫోన్ లో ఈ నెంబర్ లను సేవ్ చేసుకోవాలి. HP గ్యాస్ అయితే 9222201122 లేదా 771895555 కి ఇంకా ఇండేన్ గ్యాస్ అయితే 7588888824 కి , భారత్ గ్యాస్ అయితే 1800224344. వీటిని బట్టి చాల సులువుగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.
వాట్స్ అప్ నెంబర్ లతో రీఫిల్ బుకింగ్ ఎలా చేయాలో చూద్దాం?
దీనికి సంబంధించి ముందుగా గ్యాస్ బుకింగ్ చేయాలంటే నెంబర్ లు కావాలి. వాటి కోసం ఇండేన్ కస్టమర్ LPG సిలిండర్ బుక్ చేయాలంటే ఈ నెంబర్ కి 7718955555 కాల్ చేయాలి. లేదంటే రీఫిల్ అని టైప్ చేసి వాట్స్ అప్ ద్వారా మెసేజ్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దింట్లో కొన్ని అప్షన్స్ ఉంటాయి. వాటిలో మనకి ఏ సర్వీస్ కావాలో చూసుకుని గ్యాస్ రీఫిల్ చేయాలన్నా, కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలన్నా , కనెక్షన్ గురించి కంప్లైంట్ చేయాలన్న కూడా మొత్తం ఇందులో చేసుకోవచ్చు. ఇలా క్షణాల్లో బుక్ చేసుకుంటే ఇంటి ముందుకే గ్యాస్ వస్తుంది.