Mind Reading Tips: ఎదుటివారి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా ?
ఎదుటి వారి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే అది వాళ్ళ ప్రవర్తనను బట్టి తెలుసుకోవచ్చు. వీటన్నిటి గురించి తెలుసుకునే టిప్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.
మైండ్ రీడింగ్ టిప్స్
మనిషి మనసుని చదవాలని తెలుసుకోవాలని అందరికి ఆత్రం గానే ఉంటుంది. కానీ వాటిని ఎలా తెలుసుకోవచ్చు అని అందరికి తెలియదు. అలా అని మనిషి మనసుని పూర్తిగా తెలుసుకునే అవకాశాలు కూడా లేవు. మనిషి బ్రెయిన్ తో టెక్నలాజి ఎంత పెరిగినా వాళ్ళ మనసును తెలుసుకునే టెక్నలాజి మాత్రం ఇంకా రాలేదు. బహుశా రాదేమో కూడా. కానీ వాళ్ళ ఆలోచనా , భావాలను బట్టి వాళ్ళ మనసును కొద్ది మేర తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వాటిని మనస్తత్వశాస్త్రం లో ని పద్ధతుల్లో చూద్దాం.
శరీర కదలికలు
Also Read: నిద్ర కు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా ?
కొన్నిసార్లు మనిషి యొక్క ప్రవర్తన ను బట్టి వాళ్ళు కోపంగా ఉన్నా , భయం గ , ఆందోళన గ ఉన్నా దాని వెనుక ఉన్న రహస్యాన్ని బట్టి కొంచెం అర్ధం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అని . ఇలాంటి ప్రవర్తనల ద్వారా తెలుసుకోవచ్చు.
తల ఊపడం
చాల వరకు ఇద్దరి వ్యక్తుల సంభాషణలో ఒకరు చెప్తున్నప్పుడు ఇంకొకరు వింటున్నారు అనుకుంటాం కానీ వాళ్ళు ఎలా వింటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. చెప్పేది దీర్ఘంగా వింటున్నారా లేదా వింటునట్టు నటిస్తున్నారా అని. కొన్నిసార్లు చెక్ చేయడానికి ఎదుటివారిని ఏంచెప్పా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు అలాంటప్పుడు మనం అర్ధం చేస్కోవచ్చు. మనిషి ఇక్కడ ఉన్నా మనసు మాత్రం ఇక్కడ లేదు అని ఇలా వాళ్ళ ప్రవర్తనను బట్టి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి.
పాదాలు కదపడం
ఒక వ్యక్తి ఏదైన ఒక విషయం గురించి వింటున్నారా లేదా అని వాళ్ళ పాదాలను బట్టి చెప్పవచ్చు. వింటున్న వ్యక్తి పాదాలు నిటారుగా ఉంటే వింటున్నారు అని అలా కాకుండా పాదాలు వేరొక దిశ లో ఉంటే వాళ్ళకి ఆ విషయం మీద ఇంట్రెస్ట్ లేదు అని అర్ధం చేస్కోవచ్చు.
కను రెప్పలు వేయడం
ఒక మనిషి కనురెప్పలు సాధారణంగా నిమిషానికి ఆరు నుండి ఎనిమిది సార్లు కనురెప్ప లు వేస్తాడు. మనిషి కనురెప్పల వేగంతో వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు అని తెలుసుకోవచ్చు. వాళ్ళ కనురెప్పల వేగం పెరిగితే వారు భావోద్వేగ స్థితిలో ఉన్నారని లేదా అంతకంటే ఎక్కువ గ ఉంటే భయం తో నో లేక ఆందోళన తోనో ఉన్నారని వాళ్ళ స్థితి సరిగా లేదని ఉద్దేశాలు వేరే ల ఉన్నాయని సూచిస్తుంది.
స్వరం మార్చడం
స్వరం మార్చడం ద్వారా వాళ్ళ ఒక వ్యక్తి మనసును తెలుసుకోవచ్చు. వ్యక్తులు వారి మనోభావాలు , భావోద్వేగాలను బట్టి వారి స్వరమును మారుస్తారు. లోపల నుండి ఆ స్వరం యొక్క బేస్ ని బట్టి వాళ్ళు భయం తో ఉన్నారని
అదే వాళ్ళు ఉత్సహంగా , చలాకీగా మాట్లాడితే అది మోసాన్ని సూచిస్తుంది.
కంటిచూపు
చాల వరకు ఎదుటి వారి కంటి చూపు ని బట్టి వాళ్ళ ఆలోచనా విధానం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారు ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారంటే వారు విశ్వాసం, నిజాయితీగా ఉన్నారు అని , అలా కాకుండా వాళ్ళు దిక్కులు చూస్తూ మాట్లాడుతున్నారంటే మాత్రం వారు భయంగా, అబద్దానికి సంకేతంగా ఉన్నారని సూచిస్తుంది. మనిషి యొక్క ఆలోచనా విధానం, భావోద్వేగాలను బట్టి భావాలను బట్టి మనసులో ఏమనుకుంటున్నారో కనుగొనడం తప్ప పూర్తిగా వారి మనసును తెలుసుకోవడం చాలా కష్టం.