Mineral Water Side Effects – మినరల్ వాటర్ తాగుతున్నారా ? అయితే కష్టమే !
సాధారణంగా మినరల్ వాటర్ తాగడం ప్రమాద రహితమే. కానీ వీటి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాల ఉన్నాయి. వీటిలో మినరల్స్ సరిగా ఉండనందున దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే మినరల్ వాటర్ కి బదులు మామూలు వాటర్ ఏ తీసుకుంటే మంచిది అని నిపుణులు అంటున్నారు. అసలు మినరల్ వాటర్ తాగడం వల్ల వచ్చే సమస్యలు ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ సమస్యలు
మినరల్ వాటర్ తాగడం వల్ల కిడ్నీ సమస్యలు ఎదురవుతాయట. అంతేకాకుండా కిడ్నీలో రాళ్ళూ కూడా ఏర్పడే ప్రమాదం ఉందని అధ్యయనాలు వెల్లడించాయి.
మోకాళ్ళ నొప్పులు
మినరల్ వాటర్ తాగడం వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా తక్కువ వయస్సు నుండే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మినరల్ వాటర్ లో కాల్షియం, సోడియం , ఫాస్ఫరస్ , సల్ఫర్ , మెగ్నీషియం వంటి మినరల్స్ వాటర్ లో ఉండక అవి మన శరీరానికి అందక ఇలానే మోకాళ్ళ నొప్పులకు గురికావాల్సొస్తుంది.
రక్త పోటు మరియు గుండె సమస్యలు
మినరల్ వాటర్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఇలా ఎక్కువ సోడియం ఉన్న వాటర్ తీసుకోవడం వల్ల రక్త పోటు , మరియు ఇతర హృదయ సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చు.
మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్య వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి.