NTR Bharosa Pensions Scheme Details: ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ … అన్ని పెన్షన్ల నగదు పెంపు
సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ముందు ఇచ్చ్చిన హామీ ని నెరవేరుస్తూ ప్రస్తుతమున్న వైఎస్సార్ పెన్షన్ కానుక ను ” ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం గ మార్చడం జరిగింది. ఈ పెన్షన్ పథకానికి సంబంధించి వైఎస్సార్ పేరును తొలగిస్తూ ఆంద్రప్రదేశ్ లోని వివిధ వర్గాల లబ్ధిదారులకు సామజిక భద్రత పెన్షన్ పెంపుదల చేస్తూ ప్రభుత్వం జీవో నమ్.43ను విడుదల చేసింది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు వారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ తరువాత పెన్షన్ పెంపుపై సంతకం చేయడం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా రూ . 3000 ఉన్న పెన్షన్ ను రూ .4000వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందువల్ల ఇక జులై 1 నుండి ఏపీ లో 66లక్షల మంది పెన్షనర్లకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ ఇవ్వడం జరుగును.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో రూ 3000 నుండి 4000/ పెన్షన్ అందుకునేవారు
●వృద్దాప్య పెన్షన్ దారులు
●వితంతువులకు
●చేనేత కార్మికులు
●చర్మకళాకారులు
●మత్స్యకారులు
●ఒంటరి మహిళలు
●సంప్రదాయ
●చెప్పులు కుట్టేవారు
●ట్రాన్స్ జెండర్లు
●ఆర్ట్( పల్లీవ్)
●డప్పు కళాకారులు
●కళాకారులకు పెన్షన్లు
పైన తెలిపిన వీరికి ఆగష్టు నెల నుండి ఎప్పటిలాగే రూ 4000/ పంపిణీ చేయడం జరుగుతుంది.
■అలాగే రూ 4000/ పెన్షనర్లకు సంబందించి వారికీ వచ్చే నెల అనగా జులై 1, 2024 , పెన్షన్ ను 2024 ఏప్రిల్ 1 మొదటి నుండి అనగా (ఏప్రిల్ , మే , జూన్ ) ఈ త్రీ మొంత్ కి కలిపి 3000/ మరియు పెంచిన రూ 4000/ కలిపి మొత్తం రూ 7000 పంపిణీ చేయడం జరుగుతుంది.
ఎన్టీఆర్ భరోసా పథకంలో మిగిలిన వారికీ మొత్తం లో పెరిగిన పెన్షన్
1. వికలాంగుల పెన్షన్ 3000 నుండి 6000.
2. కుష్టువ్యాధిగ్రస్తులకు కూడా 6000.
3. పూర్తిగా వికలాంగులైనటువంటి వారికీ 5000 నుండి 15000 లకు పెంచడం జరిగింది.
ఇవే కాకుండా 5000 నుండి 10,000 ల వరకు పెరిగిన పెన్షన్ దారులు
●దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు
●దైపాక్షిక ఎలిఫెంటీయాసిస్ _గ్రేడ్ _4
●కిడ్నీ , కాలేయం మరియు గుండె మార్పిడి
●CKDU డయాలసిస్ CKD సీరం క్రియాటినిన్
●CKDU ఆన్ లో డయాలసిస్ CKD చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ.
●సీకాడు డయాలసిస్ పై CKD అంచనా వేసి GFR.