Natural Tips To Delay Periods: పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేసే ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా ? చాలామంది పండుగలు , పెళ్లిళ్లు ఇలా కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుందట. ఇందుకోసం చాల మంది మందులు వాడుతూ ఉంటారు. ఇలా ముందులు వాడి ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా ఇంట్లోనే దొరికే సహజ సిద్దమైన ఆహార పధార్ధాలతో తయారు చేసుకుని పీరియడ్స్ పోస్ట్ పోన్ చేస్కోవచ్చు. ఇలా పీరియడ్స్ ని వాయిదా వేసే సహజ నివారణలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ, క్యారెట్ , ఆరెంజ్
ఉసిరికాయ తీసుకుని అందులో గింజ తీసేయాలి. మిగిలిన ఉసిరిని ముక్కలుగా కట్ చేయాలి. ఒక మిక్సీలో క్యారెట్, ఉసిరి , ఆరంజ్ ముక్కలు కొంచెం నీరు వేసి మెత్తగా మిక్స్ చేయాలి. తర్వాత ఆ జ్యూస్ వాడకట్టాలి. ఇప్పుడు దీన్ని నెలసరి కి వారం రోజుల ముందు నుంచి డైలీ తాగుతూ ఉండాలి. దీని వల్ల శరీరానికి చలవ చేసి ,నెలసరి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ పీరియడ్స్ ఆలస్యం చేయడానికి ఇది సమర్ధవంతమైన సహజ నివారణ. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే రక్తం గడ్డ కట్టడం మరియు రక్త ప్రవాహాన్ని తేలిక పరుస్తుంది. దీన్ని పీరియడ్స్ కి ఒక వారం రోజుల ముందు నుండి ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కరిగించి తాగడం వల్ల ఇది శరీరానికి సహాయ కరంగా ఉంటుంది.
నిమ్మరసం
ఈ పీరియడ్స్ ఆలస్యం చేయడానికి ఇది పురాతన పద్ధతుల్లో ఒకటి. వృత్తాంత అధ్యయనా ల ప్రకారం ఈ నిమ్మరసాన్ని మితమైన పరిమాణం లో తాగడం వల్ల పెరిఒద్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఒక గ్లాస్ నీటిలో రెండు చెంచా ల నిమ్మరసం కలిపి తాగడం వల్ల ఈ పీరియడ్స్ ఆలస్యం అవుతాయి.
పుచ్చకాయ
పుచ్చకాయ పూర్తీ పోషకాహారాన్ని కలిగిఉంటాయి. తీపి , జ్యూసి , గుజ్జు పండ్లు ఇలాంటివి పీరియడ్స్ ఆలస్యం చేయడానికి ఒక అద్భుతమైన నివారణ. దీన్ని పీరియడ్స్ కి ఒక వారం ముందు తీసుకుంటే పీరియడ్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
జెలటిన్
అనుకున్న విధంగా పీరియడ్స్ కి ఒక 3_4రోజుల ముందు నుండి రోజుకి ఒకసారి జెలటిన్ టీ తాగడం వలన కొంత టైం వరకు పీరియడ్స్ ఆపే అవకాశాలు ఉన్నాయి.
పప్పు పులుసు
ఈ శనగ పప్పు ను మెత్తగా పొడి చేసి , ప్రతిరోజూ ఏదైనా సూప్ లో రెండు టీ_స్పూన్లు కలిపి పీరియడ్స్ కి 10 రోజుల ముందు ఇది తీసుకోవడం వల్ల పీరియడ్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
దాల్చిన చెక్క
ఈ దాల్చిన చెక్క టీ ని తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేని అద్భుత ఔషధం.
ఇంకొన్ని సహాజ సిద్ధమైన ఆహారాలు
●చింతపండు గుజ్జు
●రాస్బెర్రీ ఆకులు
●కూల్ దోసకాయ
●మామిడి బెరడు
పైన తెలిపిన ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసుకునే సహజ సిద్ధమైన ఆహార పదార్ధాలు వల్ల పీరియడ్స్ ని పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరింత ఆరోగ్యము మరియు ఆరోగ్య చిట్కాలు కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.