Side Effects Of Using Ear Phones: ప్రతిరోజు ఇయర్ ఫోన్స్ వాడకం ప్రాణాంతకమా? ఈ రోజుల్లో ఇయర్ ఫోన్స్ గాని ఫోన్ గాని ఎలా వాడుతున్నారంటే అవి లేకపోతే మేం లేము అన్నట్టు వాడుతున్నారు. వర్క్స్ అని , ఆడియో , వీడియో కాన్ఫెరెన్స్స్ అని సాంగ్స్ వినడానికి అని ఇలా రకరకాలుగా వాడేస్తున్నారు. అయితే వాటిని ఉపయోగించే విషయంలో కాస్త జగత్త గా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల భవిష్యత్తులో చాలా సమస్యకు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అసలు ఇయర్ ఫోన్స్ వాడకం లో వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇయర్ ఫోన్స్ షేర్ చేసుకోకూడదు
ఇయర్ ఫోన్స్ షేర్ చేసిన వ్యక్తికి మీ చెవి నుండి అదే బాక్టీరియా బదిలీ చేయబడుతుంది. కాబట్టి ఇయర్ ఫోన్స్ షేర్ చేసుకోవడం మానేయాలి. లేదంటే ఇన్ఫెక్షన్స్ తో బాధపడాలి. ఇయర్ ఫోన్స్ వాడే వారి చెవిలో ప్రమాదకర
బాక్టీరియా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి ఎవరిది వారు మాత్రమే వాడాలి.
గుండె జబ్బులు వచ్చే ప్రమాదం
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇయర్ ఫోన్స్ తో ఎక్కువ సౌండ్ పెట్టి వినడం వలన ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తుంది. ఇంక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇలా ఎక్కువ సేపు ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినడం వల్ల గుండెపై తీవ్ర ప్రభావం కలిగి గుండెకు మరింత హాని కలుగుతుంది.
తలనొప్పి
ఈ ఇయర్ ఫోన్స్ లో ఉండే విద్యుదయస్కాంత తరంగములు ఏవి అయితే ఉంటాయో అవి మనం ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినడం వలన మన మెదడు పై చెడు ప్రభావం చూపుతాయి. దీని వల్ల మనకి తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలకు దారి తీస్తాయి.
ఇన్ఫెక్షన్స్
ఇలా చెవిలో ఇయర్ ఫోన్స్ గంటల తరబడి పెట్టి ఉంచడం వల్ల బాక్టీరియా పెరిగిపోతుంది. ఇది బయట గాలి లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. దీని వల్ల వివిధ రకాలైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
హైపర్ టెన్షన్
కొన్నిసార్లు ఈ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన వీటి ప్రభావం మన సామజిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీని వల్ల ఆందోళన , ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది.
పరధ్యానం
ఇయర్ ఫోన్స్ రెగ్యులర్ గా వాడటం వల్ల మన ఏకాగ్రత ను కోల్పోతాం , దీని వల్ల మనం తీసుకునే నిర్ణయాలు తప్పుదారి పట్టవచ్చు. ఇలా చేయడం వల్ల మనల్ని మనం కోల్పోయి ఏదో పరధ్యానం లో ఉండిపోతాం.
చెవుడు
పరిశోధన ప్రకారం రెండు గంటల కంటే ఎక్కువ సేపు పాటను వింటే మన వినికిడి సామర్ధ్యం దెబ్బతింటుంది. ఇలా ఎప్పుడు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటం వల్ల వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి మన చెవుల కి వినికిడి సామర్ధ్యం 90 డెసిబుల్స్ , మనం ప్రతిరోజూ ఎక్కువ సౌండ్స్ తో ఇయర్ ఫోన్స్ వాడితే అది 40 డెసిబుల్స్ కి చేరుకుంటుంది. దీని వల్ల వివిధ రకాల చెవి సమస్యలు ఎదురవుతాయి.
నిద్ర సమస్య
చాల మంది చాల వరకు మనసు ప్రశాంతత కోసం అని పడుకునే ముందు నచ్చిన సాంగ్స్ వింటూ పడుకుంటారు. దీని వల్ల నిద్ర సంబంధిత వ్యాధులు రావచ్చు. దీని కారణంగా నిద్ర నిదానం తీవ్రంగా దెబ్బతిని, తినడం నుండి నిద్రపోయేదాకా ప్రతి దానిపై తీవ్ర ప్రభావితం చేస్తుంది.
గమనిక: నిపుణులు మరియు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించండి. గమనించగలరు.