Using Same Soap: ఇంట్లో అందరు ఒకే సబ్బు వాడుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త
ఇంట్లో అందరు ఒకే సబ్బు వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. సాధారణంగా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకే సబ్బును వాడటం అలవాటు అయిపొయింది. దీని వల్ల అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం కూడా ఎక్కువ గానే ఉంది. ఇది గ్రామాల్లో ఎక్కువ గ చోటు చేసుకుంటుంది . దీని వల్ల ఎదురయ్యే సమస్య లు ఏంటో తెలుసుకుని తగిన జాగ్రత్త లు తీసుకుందాం.
బ్యాక్టీరియా భయం:
స్నానానికి ఉపయోగించే సబ్బులో సాధారణంగా రెండు నుండి ఐదు రకాల సూక్ష్మ జీవులు ఉంటాయని ఇండియన్ జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్ లో తేలింది. నిపుణుల ప్రకారం సబ్బులో సాల్మొనెల్లా , జెర్మ్స్ ,షిగెల్లా వంటి బాక్టీరియా అలాగే నోరోవైరస్ , రోటవైరస్ , స్టాఫ్ వంటి వైరస్ లు ఉంటాయి. అయితే కొన్ని రకాల బ్యాక్టీరియా చర్మం పై గీతలు , గాయాల ద్వారా వ్యాప్తి చెంది అనారోగ్యం పాలవుతారు.
ఒకే సబ్బుతో వ్యాపించే ఇన్ఫెక్షన్ ఇదే:
ఒకే సబ్బును అందరు వాడటం వలన సంక్రమించే ఒక ఇన్ఫెక్షన్ ఉంది. ఇలా వాడే వారికి యాంటీబయాటిక్_రెసిస్టెంట్ స్టాఫ్ ఇన్ఫెక్షన్ అనే మెథీసిలిన్ _రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ ( MRSA) పునరావృత అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది.
Also Read : వేడి నీరు త్రాగడం వల్ల ప్రయోజనాలు
వాడిన సబ్బును వేరొకరు వాడే ముందు ఏంచెయ్యాలి:
ఒకరు వాడిన సబ్బుపై పేరుకుపోయిన సూక్ష్మ జీవులు లేదా బ్యాక్టీరియా వంటివి ఉండటం వల్ల అనారోగ్య బారీన పడవలసి ఉంటుంది. మీరు ఒకరి సబ్బును వాడుతున్నప్పుడు బాగా నురగగా ఉండేలా చూసుకోవాలి. ఒకసారి కడిగిన తర్వాత సబ్బును కాసేపు ఆరబెట్టాలి. ఎందుకంటే వ్యాధికారక క్రిములు ఏవైనా ఉంటే అవి చనిపోతాయి. అయితే వాడిన సబ్బును ఉపయోగించే ముందు సబ్బును బాగా కడగడం వల్ల వ్యాప్తి ని నిరోధించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేస్తే బ్యాక్టీరియా మరొకరికి వ్యాపించదు:
పరిశోధకులు తమ చేతులను సబ్బుతో కడుక్కొని , మరొక వ్యక్తిని చేతులు శుభ్రంగా కడుక్కొని ఉపయోగించమని సూచించారు. అప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది ఒకరి నుండి మరొకరికి వ్యాపించలేదని గుర్తించారు. కానీ చర్మ నిపుణుల ప్రకారం ఒకే సబ్బును అందరు వాడటం మంచి పద్ధతి కాదని, ప్రత్యేకించి ఎవరికై నా అంటువ్యాధులు సోకినట్లయితే చాలా చర్మం వ్యాధులు ఒకే సబ్బును వాడటం ద్వారానే వ్యాపిస్తాయని తెలిపారు.
అంటువ్యాధి నివారణలు – Epidemic Remedies
👉 సబ్బును వాడిన తర్వాత దానిని శుభ్రంగా నీళ్లతో కడగాలి.
👉 ఇరవై నుండి ముప్పై సెకన్ల పాటు నురగ వచ్చేలా కడగాల్సి ఉంటుంది.
👉 సబ్బుని గాలి తగిలేలా ఉంచాలి. సబ్బు పెట్టెలో నీళ్లు నిల్వ ఉండకుండా బయటకు పోనివ్వాలి.
👉 సబ్బుకి బదులుగా లిక్విడ్ హ్యాండ్ వాష్ సోప్ ని ,లిక్విడ్ బాడీ వాష్ ని వాడటం మంచిది.
ఇలా చేస్తే అంటువ్యాధులు అనేవి నివారించవచ్చు.
గమనిక: నిపుణులు మరియు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించండి. గమనించగలరు.