Using Phone Before Bed – నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?

నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?

నిద్ర కు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా ?

పడుకునే ఫోన్ చూడకుండా ఉండట మంచిది. ఇది అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఫోన్ ఆరోగ్యానికి హానికరం. కానీ ప్రజలు ఈరోజు ల్లో ప్రజలు ఫోన్ లేకుండా జీవించలేనంతగా పెరిగిపోయింది. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు జాగ్రత్తలు ఖఛ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇలా వాడటం వలన అనేక అనర్ధాలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఫోన్ అతిగా వాడటం వలన వచ్చే సమస్యలు

చర్మ వ్యాధులు

నిద్రకు ముందు ఫోన్ , టీవీ , laptop ఎక్కువగా వాడటం వలన ముఖ్యం గా ముఖం పై మొటిమలు సమస్య పెరుగుతుందని చర్మ వ్యాధి నిపుణులు చెబుతున్నారు. అలాగే అకాల వృద్దాప్యం, చర్మం పై ముడతల సమస్య వస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజిన్ ఉత్పత్తి పడిపోతుంది. లూపస్ , రోసెమియా వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

జుట్టు సమస్యలు

రాత్రి పూట అతిగా వాడటం వలన ఒత్తిడికి గురి అయి ఆ ప్రభావం జుట్టు మీద పడుతుంది. అయితే జుట్టు పై స్క్రీన్ కిరణాలు పడటం వలన ఇబ్బంది లేనప్పటికినీ, ఎక్కువ సేపు ఫోన్ వాడటం వల్ల సిర్కాడియన్ చక్రం దెబ్బతింటుంది. దీనితో ఒత్తిడి సమస్య పెరిగి జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

కంటి సమస్యలు

కంటి సమస్యలు

చీకట్లో ఎక్కువ సేపు వాడుతుంటే కళ్ళు పొడి బారడం , దురద , మంట , ఎర్రబడటం వంటి సమస్యలు రావచ్చు. బెడ్ లో ఎక్కువ సేపు ఫోన్ ని ఉపయోగించడం వల్ల కంటి అలసట అనేది ఒక సాధారణ సమస్య. మీరు ఫోన్ ని ఎక్కువ సేపు వాడటం వలన కళ్లల్లో నుండి నీళ్లు కారడం. ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సొస్తుంది.

నిద్రలేమి సమస్యలు

ఫోన్ స్క్రీన్ నుండి వచ్చే బ్లు లైట్ కు ఎక్కువ గురయితే నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. మన దృష్టంతా ఫోన్ లో చూసే వాటిపైనే యాక్టీవ్ గ ఉంటుంది. దాంతో మీకు తగిన నిద్ర పోవడానికి అవకాశం ఉండదు. ఇది నిద్ర లేకుండా చేయడమే కాకుండా నిద్ర లో కూడా ఇబ్బంది కలిగిస్తుందట. ముఖ్యం గా ప్రతిరోజు ఐదు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ లలో వాడే విద్యార్థుల్లో నిద్ర సమస్యలు ఉంటాయని నిపుణులు గుర్తించారు.

ఒత్తిడి సమస్యలు

ఒత్తిడి సమస్యలు

ఫోన్ చూసేటప్పుడు మన చేతులు చాలా సేపు ఒకే స్థితిలో ఉంటాయి. సమస్య ఏంటంటే మన శరీరం సాధారణంగా అలాంటి ఇబ్బంది కరమైన స్థితిని ఎక్కువ కాలం కొనసాగించలేవు. అలా గంటలు తరబడి చేత్తో పట్టుకునీ పట్టుకుని చుడటం వలన మీ శరీరం పై , ముఖ్యం గా ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి లో ఉండే వారికి సరిగా నిద్ర పట్టదు. ఇలాంటి వారు ఫోన్ వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒత్తిడి ఇంకా ఎక్కువ అవుతుంది. నిద్ర మరింత దూరం అవుతుంది. మీ మెదడుపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే మానసిక సమస్యగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట.

క్యాన్సర్ ప్రమాదం

Also Read: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ బదులు అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చి చెప్పారు. స్మార్ట్ ఫోన్ ద్వారా ఎలక్ట్రానిక్ మాగ్నెటిక్ రేస్ విపరీతంగా రావడం కారణంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు రావచ్చునని నిపుణుల సూచన.

బ్రెయిన్ ట్యూమర్

మొబైల్ ఫోన్ చాలా మంది క్రింద జేబు లో పెట్టుకుంటు ఉంటారు. ఇలా చేయడం వల్ల రేడియేషన్ అనేది మన శరీరం లో కి చేరి తద్వారా పురుషుల్లో ఉండే స్పెర్ము కౌంట్ విపరీతంగా పడిపోయి , అంతేకాక సంతాన సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఇంక చెవి మరియు బ్రెయిన్ ట్యూమర్ లు వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్త లు

* ముఖ్యం గా ఫోన్ ను అతిగా ఉపయోగించడం మంచిది కాదు. ముఖ్యం గ రాత్రిళ్ళు పడుకునే ముందు అస్సలు వాడకూడదు.
* దీని బదులు మీకు నచ్చిన బుక్స్ లేదా ఇంకా రకరకాల పనులు నేర్చుకోవడం లో ఆసక్తి చూపండి.
* చీకట్లో కూర్చోకూడదు ఒకవేళ ఉన్నా మొబైల్ బ్రైట్నెస్ తగ్గించాలి . అలా అని మరీ తగ్గించి చూడకూడదు మినిమమ్ 25 నుండి
35 లోపు బ్రైట్నెస్ ఉండేలా చూసుకోవాలి.
* దీనిని పరిష్కరించడానికి మీరు తల , మెడ మరియు వెన్నుముక ను నిటారుగా నిలబెట్టే దిండును ఉపయోగించాలి.
* అన్నిటికన్నా నిద్ర కు మనం ఎక్కువ ప్రాముఖ్యత ను ఇవ్వాలి. దీని వల్ల ఫోన్ వాడకాన్ని నివారించవచ్చు.
* ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు మాత్రం ఫోన్ , టీవీ లాప్టాప్ లాంటివి వాడకపొతే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *